Siluva Viluva Perige
సిలువ విలువ పెరిగే – నీవు తాకిన వెంటనే
హృదయాన మార్పు కలిగే – సిలువ రక్తము చిందగనే “2”
ఇది కాదా పరివర్తన – నీ రక్తము ద్వారానే
ఇది కాదా హృదయ మార్పు – నీవు నాలోకి రాగానే “2”
1 సందేహపడలేదు – వెనుకాడ లేదయ్యా
నా కొరకు – సిలువను మోయడానికి
దోషము భరించావు -మౌనము వహించావు
పరిశుద్ధునిగా – నన్ను చూడటానికి
ఏ మంచి ఉందని – నాలో ఇంత ప్రేమను పంచినావు.
ఏమివ్వగలనే – నా కొరకు సమస్త అర్పించావు “2”
నీ ప్రేమకు – నీ త్యాగము దాసోహమ్తెనాను “2”
” సిలువ విలువ ”
2 నన్ను కొన్నావు – నీ సిలువ రక్తముతో
అరుధిరమే -నాలో ప్రవహించాలనీ
కలలు కన్నావు – కన్నీరు కార్చావు – నేను నీ సొంతమై ఉండాలనీ “2”
పరిశుద్ధుడా యేసయ్య – నా పాపమంతా కడిగి
నీ రక్షణ వస్త్రముతో – నన్ను అలంకరించీనావు “2”
నే జీవించు కాలమంతయు – నీ సాక్షిగా బ్రతికెదను
నా ఊపిరి ఉన్నంతవరకు – సిలువ ప్రేమను చాటెదను.
” సిలువ విలువ “
