Nenante Neeku Antha Istama

పల్లవి: నేనంటే నీకు అంత ఇష్టమా నాకై మరణించేటంత ఇష్టమా
యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్యయేసయ్య ఓ నా యేసయ్య

1. అన్యాయపు తీర్పు పొందావనాకై అవహేళనలెన్నో భరియించావా //2//
నాకు న్యాయం చేయుట కొరకై
నా అవమానమును కొట్టివేయుటకై //2// యేసయ్య

2. ముళ్ళ కిరీటమును ధరించావా కొరడా దెబ్బలనే భరించినావా //2//

జీవ కిరీటము నాకిచ్చుటకు
నా ఘోర వ్యాధిని తొలగించుటకు //2// యేసయ్య

3. సిలువలో మేకులతో వ్రేలాడితివా నీ చివరి శ్వాసను అర్పించినావా //2//
నా శాపమునంత బాపుట కొరకు పునరుద్దాన మహిమ నాకిచ్చుటకు //2// యేసయ్య

Tags: